Site icon NTV Telugu

Manish Sisodia: మనీష్ సిసోడియాను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ.. 100 మంది ఆప్‌ నేతల అరెస్ట్

Manish Sisodia

Manish Sisodia

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. సిసోడియాను దాదాపు 9గంటల పాటు ప్రశ్నించారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విజయ్ నాయర్‌ను ఎందుకు కలిశారు?.. మద్యం పాలసీ విధానం ఆయనను ఎందుకు భాగస్వామ్యం చేశారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వల్ల ఢిల్లీ సర్కారు ఆదాయం పడిపోతుందని మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం ఎవరు లబ్ధి పొందుతారనే కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

నూతన మద్యం పాలసీలో కొద్ది మంది వ్యాపారులను ఎందుకు ఎంపిక చేశారని సిసోడియాను ప్రశ్నించారు. ప్రభుత్వం, వ్యాపారస్తుల మధ్య క్విడ్ ప్రొకో జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ వ్యక్తులను కలిశారా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామచంద్ర పిళ్లై, శరత్ చంద్ర, రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

CJI Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌.. కేంద్రం ఆమోదం..

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను అనవసరంగా కేసులో ఇరికించి ప్రశ్నిస్తున్నారంటూ వందలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు సీబీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసనలను అడ్డుకునేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే 100 మందిని అరెస్ట్‌ చేయగా.. వారిలో మంత్రి సంజయ్ సింగ్‌ కూడా ఉన్నారు. అరెస్ట్‌ సమయంలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అరెస్టైన వారందరీని ఫతేపుర్‌ బేరి ప్రాంతానికి పోలీసులు తరలించారు.

అంతకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా మనీష్ సిసోడియా ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ ప్లాన్‌లో భాగంగా తనను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారని సిసోడియా ఆరోపణలు చేశారు. అటు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌పై సీబీఐ జరుపుతున్న దర్యాప్తునకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో అర్వింద్ కేజ్రీవాల్ ముడిపెట్టారు. మనీష్ సిసోడియాను డిసెంబరు 8 వరకు జైల్లో పెట్టబోతున్నారంటూ సోమవారంనాడు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version