Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryan Shukla: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా లెక్కలు వేసినా, 16 ఏళ్ల ఆర్యన్ శుక్లా తన మనసుతోనే అంతకంటే వేగంగా క్షణాల్లో సమాధానం చెప్పగలడు. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన ఈ బుడ్డోడి ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చిన్న వయసులోనే అసాధారణమైన జ్ఞాపకశక్తి, కౌంటింగ్ వేగంతో ఏకంగా తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 12 ఏళ్ల ప్రాయంలోనే మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌ను గెలుచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇతడిని ఇప్పుడు అందరూ భారత్ గర్వించదగ్గ ‘హ్యూమన్ కాలిక్యులేటర్’ అని పిలుస్తున్నారు. ఈ అద్భుత విజయాల వెనుక కేవలం లెక్కల మీద ఆసక్తి మాత్రమే కాదు, ఏడేళ్ల అంకితభావం, ఎలాంటి ఒత్తిడి పెట్టని తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నాయి.
ఆర్యన్ ప్రయాణం ఆరేళ్ల వాయసులోనే సాధారణమైన కుతూహలంతో ప్రారంభమైంది. అంకెలు, లెక్కల పట్ల ఆసక్తి చూపించిన ఆర్యన్లోని ప్రత్యేకతను అతని తల్లిదండ్రులు త్వరగానే గుర్తించారు. సాధారణ పిల్లలలా కాకుండా ఇతను ఏదో విభిన్నంగా చేస్తున్నాడని గ్రహించి, తండ్రి నితిన్ శుక్లా వెంటనే ఆ బాలుడిని పోటీలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అలా 2018లో ఇస్తాంబుల్‌లో జరిగిన మెమోరియాడ్ టర్కీ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిదేళ్ల ఆర్యన్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి 7 బంగారు పతకాలతో పాటు మొత్తం 10 పతకాలు సాధించి రెండు చిన్నారుల ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
Also Read
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
ఈ అంతర్జాతీయ ప్రయాణంలో భాగంగా జూలై 2022లో జర్మనీలోని పాడెర్బోర్న్లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 40 మంది మేధావులతో పోటీపడి కేవలం 12 ఏళ్ల వయసులోనే ఛాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ పోటీల్లో జపాన్ జట్టుదే పూర్తి ఆధిపత్యం ఉండేది. ఆ ఆధిపత్యాన్ని చెరిపేస్తూ ఆర్యన్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో జరిగిన పోటీల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, 900 మార్కులకు గానూ 819.84 మార్కులు సాధించి ఓవరాల్ ర్యాంకింగ్, వెర్సటైలిటీ, అడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్స్, కాలెండర్ డేట్స్ – ఇలా ఆరు విభాగాల్లోనూ ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా వివిధ విభాగాల్లో ఐదు ప్రపంచ రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు.
ఫిబ్రవరి 2024లో ఇటాలియన్ టెలివిజన్ షో ‘లో షో డీ రికార్డ్’ ద్వారా గిన్నిస్ రికార్డుల పరంపరను ప్రారంభించాడు. కేవలం 25.19 సెకన్లలో 50 ఐదు అంకెల సంఖ్యలను మనసులోనే కూడి మొదటి గిన్నిస్ రికార్డు సాధించాడు. అదే ఏడాది డిసెంబర్ 4న దుబాయ్‌లోని గిన్నిస్ రికార్డ్స్ కార్యాలయంలో ఒక్కరోజే ఏకంగా ఆరు రికార్డులను తిరగరాశాడు. 50 ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో, 100 నాలుగు అంకెల సంఖ్యలను 30.9 సెకన్లలో, 200 నాలుగు అంకెల సంఖ్యలను నిమిషం 9.68 సెకన్లలో కూడి అందరినీ విస్మయపరిచాడు. అలాగే పెద్ద సంఖ్యల గుణకారాలు, భాగాహారాల్లోనూ రికార్డులు సృష్టించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 2026లో ఇటలీలో జరిగిన పర్యటనలో పది 8-అంకెల సంఖ్యలకు వర్గమూలాలను 71.22 సెకన్లలో కనుగొని, మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇన్ని విజయాలు సాధించినప్పటికీ, ఆర్యన్‌పై తల్లిదండ్రులు ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఫలితాల కంటే కష్టపడటమే ముఖ్యమని నమ్మించారు. ప్రస్తుతం నాశిక్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న ఆర్యన్, పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించాడు. గణితం, ఫిజిక్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న మార్పులను కూడా ఆసక్తిగా గమనిస్తుంటాడు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి మెదడు సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని, టెక్నాలజీ వైఫల్యం చెందినప్పుడు మానవ నైపుణ్యాలే అతిపెద్ద బ్యాకప్‌గా నిలుస్తాయని అతని తండ్రి నితిన్ నమ్ముతారు. కేవలం గెలుపులకే పరిమితం కాకుండా, ఆర్యన్ ఇప్పుడు తోటి పిల్లలకు మెంటల్ మ్యాథ్స్‌లో గురువుగా మారుతున్నాడు. ‘గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్’ (GMCA) వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగా ఉంటూ ఈ విద్యను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నాడు. ఆన్ లైన్ తరగతుల ద్వారా పిల్లల్లోని అంకెల భయాన్ని పోగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. 2025 నవంబర్‌లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘మిస్క్ గ్లోబల్ ఫోరమ్’లో ప్యానెలిస్ట్‌గా పాల్గొని విద్యలో మెంటల్ కాలిక్యులేషన్ ప్రాముఖ్యతపై ప్రసంగించాడు. ఇక, పిల్లలను పెంచే విషయంలో ఆర్యన్ తల్లిదండ్రులు అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. తల్లిదండ్రులు తమ అసంపూర్తి కలలను పిల్లలపై రుద్దకూడదని, వారి ఆసక్తులను గుర్తించి తగిన సమయం ఇవ్వాలని చెబుతున్నారు. ఆర్యన్‌కు లెక్కలంటే ఇష్టం కాబట్టి, ఫలితాలు ఎలా ఉన్నా ఏడేళ్లుగా వారు అండగా నిలిచారు. చివరికి ఆ ఆసక్తే అతడిని ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలా చేసింది. టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతున్నా, జిజ్ఞాస, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరుకోవచ్చని ఆర్యన్ ప్రయాణం నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!