Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఆర్యన్‌పై మాదకద్రవ్యాల కేసు, ఆ తరువాత “బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”లో ఆయన పాత్ర చుట్టూ ఉన్న వివాదం, ఇప్పుడు వైరల్ అయిన వీడియో తనని మళ్లీ ఇబ్బందుల్లో పడేసింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఇది నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. ఏకంగా ఇప్పుడు ఈ వీడియోపై ఒక న్యాయవాది ఆర్యన్‌పై ఫిర్యాదు చేసే స్థాయికి చేరుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
బెంగళూరులోని ఒక పబ్‌లో ఆర్యన్ ఖాన్ జనసమూహం ముందు మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ వీడియో ప్రజల ఆగ్రహానికి దారితీసింది. దీంతో బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఆర్యన్ ఖాన్‌పై ఫిర్యాదు నమోదైంది. పలు నివేదికల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సాంకీ రోడ్ నివాసి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఒవైజ్ హుస్సేన్ ఎస్.. బహిరంగంగా అశ్లీల చర్యలకు పాల్పడినందుకు ఆర్యన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్, డీసీపీ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు.
ఆర్యన్ ఖాన్ ఈ సంజ్ఞ చేసినప్పుడు పబ్‌లో చాలా మంది మహిళలు ఉన్నారని హుస్సేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది మహిళలను అవమానించడమేనని, భారత శిక్షాస్మృతి (IPC) నిబంధనల పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఈ సంజ్ఞ అనేది ప్రజలకు అసౌకర్యం, ఇబ్బంది, మానసిక క్షోభను కలిగించిందని న్యాయవాది తన ఫిర్యాదులో తెలిపాడు. ఇది బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు. న్యాయవాది ఓవైస్ హుస్సేన్ ఎస్ ఫిర్యాదుపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేక్ అక్షయ్ మచ్చింద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియా పోస్ట్, తమకు అందిన పబ్ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
READ ALSO: Pakistan – Afghanistan: ఆ రెండు ముస్లిం దేశాల మధ్య ఆగని పోరు..
