Gujarat: గుజరాత్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరుకానందుకు నిరసనగా ఓ ముఖ్య నేత హస్తం పార్టీని వీడారు. తాజాగా అదే కోవలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరారు. ఎమ్మెల్యే అరవింద్ లడానీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్‌లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీని వీడడం ఇబ్బందికరంగానే మారింది.
గాంధీనగర్‌లోని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి అధికారిక నివాసంలో లడానీ తన రాజీనామాను సమర్పించారు. ఆపై తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అధికార పార్టీతో కలిసి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. లడానీ రాజీనామాను శంకర్ చౌదరి ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది.
Also Read
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
తాజా ఎదురుదెబ్బతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలలకే 182 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ బలం 13కి పడిపోయింది.
త్వరలోనే లడానీ బీజేపీలో చేరనున్నారు. జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీలో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు.
2022 అసెంబ్లీ ఎన్నికలలో 3,400 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో లడానీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి జవహర్ చావ్డాపై విజయం సాధించారు. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 17 మందిలో లడానీ ఒకరు. కేవలం మూడు నెలల వ్యవధిలో పార్టీకి వీడ్కోలు పలికిన నాలుగో కాంగ్రెస్ శాసనసభ్యుడు లడానీ.
రెండు రోజుల క్రితం, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మరియు గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మోద్వాడియా అన్ని పదవులకు రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరారు. అతని కంటే ముందు ఖంభాట్ ఎమ్మెల్యే చిరాగ్ పటేల్, విజాపూర్ ఎమ్మెల్యే సిజె చావ్డా కూడా కాంగ్రెస్ శాసనసభ్యుల పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!