Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగట్టుతున్నారు. ఇందులో భాగంగానే పలు విపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. అదే సమయంలో ఇరువురు సీఎంల భేటీలో జాతీయ రాజకీయాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
Read Also:Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, ట్రాన్స్ఫర్లకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌లతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయా పార్టీలను కోరారు. మరోవైపు కాంగ్రెస్‌ను కూడా మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ సిద్దమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీకి సమయం కోరినట్టుగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
Read Also:MI vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం