Arvind Kejriwal: దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాంటి పార్టీకి ఓటరు తమ విలువైన ఓటు వేసి వృథా చేయవద్దని గుజరాత్ ఓటర్లకు సూచించారు. అందుకు బదులుగా ఆప్ కు ఓటేసి గెలిపించాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీవాల్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నవి ప్రధానంగా రెండు పార్టీలేనన్నారు. ఆ రెండింటి మధ్యే ప్రత్యక్ష పోటీ జరుగుతుందన్నారు. ప్రజలు కూడా బీజేపీ లేదంటూ ఆప్ లకు మాత్రమే ఓటెయ్యాలని కోరారు. ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.
Read Also: Mamata Banerjee : నన్ను క్షమించండి రాష్ట్రపతి జీ.. మీరు చాలా మంచివారు.
ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాతులో 27ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని ఈ సారి ఆ పార్టీకి ఆప్ గట్టి పోటీ ఇస్తుందన్నారు. మీ కుటుంబానికి పిల్లలకు భరోసా ఇచ్చే తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని గుజరాత్ ఓటర్లను వేడుకున్నారు. గుజరాత్లోని 178స్థానాల్లో తన అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆప్ ప్రకటించింది. 27ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో విసుగు చెందిన ప్రజలు, కాంగ్రెస్ పై ధ్వేషంతో ఆప్ కు ఓటేస్తారని అరవింద్ కేజ్రివాల్ వివరించారు. గుజరాత్ లో డిసెంబర్ 1, 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.