NTV Telugu Site icon

Arvind Kejriwal: మరోసారి విశ్వాస పరీక్ష సిద్ధమైన కేజ్రీవాల్.. కారణం అదేనా..?

Kejriwal

Kejriwal

Motion of no confidence: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే, కేజ్రీవాల్ ఆరు నెలల క్రితం కూడా ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక, తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉంది.. వారికి ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందన్నారు. దీంతో బీజేపీతో కలిస్తే తనపై కేసులు లేకుండా చేస్తామన్నారని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Read Also: Health Tips : మొబైల్ ను చూస్తూ తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ అధికారులు ఆరు సార్లు నోటీసులు పింపింది. ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ ఇలాగే నోటీసులిచ్చి అరెస్ట్ చేసింది.. దీంతో కేజ్రీవాల్ ను కూడా విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు ఆరోపలు చేస్తుంది. అయితే, 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్‌ మొత్తానికీ సస్పెండ్‌ చేశారు. ఇక, శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారని చెప్పారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన మరోసారి బల పరీక్షకు దిగారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.

Show comments