Site icon NTV Telugu

Kejriwal Rewari Par Charcha: ‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం

Kejriwal Rewari Par Charcha

Kejriwal Rewari Par Charcha

Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు కోత లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ 20 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని అన్నారు.

Also Read: Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

ఇకపోతే, గుజరాత్‌లో 30 ఏళ్ల ప్రభుత్వం ఉందని.. అక్కడ గత 30 ఏళ్లుగా 24 గంటల కరెంటు లేదని ఆయన అన్నారు. 24 గంటలూ కరెంటు ఇవ్వాలని.. వారికి తెలియదని అన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకుండా, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీలో కూడా 8 నుంచి 10 గంటల విద్యుత్ కోతలు మొదలవుతాయని ఆయన అన్నారు. దీనితోపాటు.. కమలం బటన్‌ను నొక్కే ముందు, ఎక్కువసేపు విద్యుత్ కోత కోసం బటన్‌ను నొక్కుతున్నారా అని ఆలోచించండి. లేకపోతే, చీపురు బటన్‌ను నొక్కండని ఆయన ప్రజలకు కోరారు. అలాగే రాజస్థాన్‌లో ఎన్ని గంటల విద్యుత్ కోతలు ఉన్నాయని కేజ్రీవాల్ అడిగారు. దేశం మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా ఢిల్లీలో 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

Also Read: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ

ఇక కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు రేవారీలు ఈ విధంగా ఉన్నాయి.
* మొదటి రేవారీ: ఉచిత విద్యుత్ ఇవ్వడం, కరెంటు కోత లేకుండా చేయడం.

* రెండవ రేవారీ: 20 వేల లీటర్ల నీరు ఉచితంగా అందివ్వడం.

* మూడవ రేవారీ: ఉచిత, అద్భుతమైన విద్యను అందించడం.

* నాల్గవ రేవారీ: షాందార్ మొహల్లా క్లినిక్ ఏర్పాటు

* ఐదవ రేవారీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం.

* ఆరవ రేవారి: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర.

Exit mobile version