Site icon NTV Telugu

Arvind Kejriwal: నేటి నుంచి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం.. పాల్గొననున్న పంజాబ్ సీఎం..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ కు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలకు నా ధన్యవాదాలు.. మన దేశానికి 4 వేల ఏళ్లు నిండాయి.. కానీ, ప్రస్తుతం మన దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. అయితే ఈ దేశంపై ఎవరైనా నియంతృత్వాన్ని ప్రయోగించాలని ప్రయత్నించినా ప్రజలు సహించరు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ ఆరాచక శక్తుల మీద పోరాటం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసి ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించాలి అని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Read Also: Lawrence Bishnoi Gang : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్.. అమెరికా షూటర్లు, స్లీపర్లు

కాగా, ఇవాళ (శనివారం) దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో చేయనున్నారు. ఆ రోడ్ షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు. కాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్‌ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక, కేజ్రీవాల్ హనుమాన్ ఆలయానికి వస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version