ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అరెస్టుపై తాజాగా అమెరికా విదేశాంగ ప్రతినిధికి సామాన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధించి న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ సకాలంలో, అలాగే పారదర్శకంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది.. అరవింద్ క్రేజీవాల్ అరెస్టును సహా అనేక చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ విషయం సంబంధించి ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేయడంతో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.
Also read: SAIL Recruitment 2024: స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
అయితే ఈ కేసు సంబంధించి మొదటిసారి మంగళవారం అమెరికా ఖండించింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అయిన గ్లోరియా బెర్బెనా సమానుకూల న్యాయ ప్రక్రియ జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ విషయం సంబంధించి బుధవారం నాడు దాదాపు 45 నిమిషాల పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాను విచారణ చేపట్టింది. ఈ సమయంలో క్రేజీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ పెద్ద ఎత్తున అభ్యంతరాలను తెలిపింది.
Also read: SAIL Recruitment 2024: స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ఇదిలా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను స్తంభించడం పై కూడా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఖాతాలకు సంబంధించి ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి ఖాతాలను స్తంభింప చేశారన్న ఆరోపణలపై తమకి అవగాహన ఉందని.. ఇలా చేయడం వల్ల వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ప్రచారానికి సవాల్ గా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇలా అన్ని సమస్యలకు న్యాయపరమైన, పారదర్శకమైన, చట్టమైన ప్రక్రియలు త్వరగా జరగాలని ఇలా చేసేందుకు అమెరికా ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.
