Site icon NTV Telugu

Election Results: నేడు అరుణాచల్, సిక్కిం ఎన్నికల ఫలితాలు..

Arunachal Results

Arunachal Results

ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కాగా.. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Read Also: Dharmapuri Srinivas Health: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థత..

మరోవైపు.. సిక్కింలోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సిక్కింలో 146 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఈసారి సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్, సిటిజన్ యాక్షన్ పారేట సిక్కింలు అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. కాగా.. మధ్యాహ్నానికి కల్లా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ ఆరంభం.. కెనడాతో అమెరికా ఢీ!

Exit mobile version