Arshad Warsi: కల్కిలో ప్రభాస్ ఒక జోకర్‌లా ఉన్నాడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్
- కల్కిలో ప్రభాస్ ఒక జోకర్‌లా ఉన్నాడు
- బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshad Warsi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. కల్కి చిత్రంలో ప్రభాస్ జోకర్‌లా కనిపించారంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
Read Also: Ankith Koyya: ‘నేను అల్లు ఫ్యామిలీలో పుట్టా, అల్లు అర్జున్ మా అన్నయ్య’.. హీరో అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మున్నాభాయ్ సిరీస్, జాలీ ఎల్‌ఎల్‌బీ, గోల్‌మాల్ ఫ్రాంచైజీ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. అయితే అర్షద్ వార్సిని తాజాగా యూట్యూబర్ సందీష్ భాటియా ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కల్కి మూవీపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అర్షద్ వార్సి. అర్షద్ మాట్లాడుతూ.. “కల్కి’ సినిమా తనకు నచ్చలేదని చెప్పాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడు. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు. ఆయనకు ఉన్న పవర్‌లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది. అతడు అసాధారణమైన వ్యక్తి. నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తు్న్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్ ముందు ప్రభాస్ ఒక జోకర్‌లా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి చేస్తాడు” అంటూ అర్షద్ చెప్పుకొచ్చాడు.
దీంతో అర్షద్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. ప్రభాస్ అభిమానులు అర్షద్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌ను అనేముందు బాలీవుడ్ ఎలా ఉందో చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ వార్సికి వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతూ.. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!