NTV Telugu Site icon

Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..

Aroori Ramesh

Aroori Ramesh

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసే బీజేపీలో చేరినట్లు ఆరూరి రమేష్ తెలిపారు. వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.

Read Also: Hyderabad: చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి విషమం

ఇదిలా ఉంటే.. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసీఆర్ ఇంట్లో జరిగిన వరంగల్ లోక్‌‌సభ సన్నాహక సమావేశంలో ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని, గెలిపించుకుంటామని కేసీఆర్‌‌‌‌ కోరగా, ఆరూరి తిరస్కరించారు. మళ్లీ బీజేపీ నేతలకు టచ్​లోకి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా నేతలు బిజీగా ఉండటంతో ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన ఆరూరి ఆదివారం బీజేపీలో చేరారు.

Read Also: Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళ.. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఏకంగా.?