Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone-School Holiday: బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘అర్నాబ్’ తుఫాను తెలంగాణపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. ఈ తుఫాను ధాటికి బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, విద్యార్థులు, విద్యా సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అక్టోబర్ 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఒక రోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఈ తుఫాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్-యానాం ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఒకవేళ అది తన దిశను మార్చుకుంటే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకొచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అర్నాబ్ ప్రభావంతో తెలంగాణలోని సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గురువారం నాటికి ఈ తుఫాను ప్రభావం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు విస్తరించి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
- Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
- లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
- Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
తాజావార్తలు
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!