NTV Telugu Site icon

Terrorists Attack: కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరికి గాయాలు

Terrorist Attack

Terrorist Attack

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో భారీ సెర్చ్, కార్డన్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.

Read Also: Anakapalle Minor Girl Incident: మైనర్ బాలిక హత్య కేసు.. నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి ప్రకటించిన పోలీసులు

జూన్ 11న చత్తర్‌గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జూన్ 12న గండో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల తరువాత.. భద్రతా బలగాలు తమ యాంటీ-టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఆ ప్రాంతంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.

Read Also: Maharastra CM: నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు..

జూన్ 26న జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11, 12 తేదీలలో కొండ జిల్లాలో జరిగిన జంట ఉగ్రవాద దాడుల తరువాత ఆర్మీ-సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో పాటు పోలీసులు జరిపిన కార్డన్ ఆపరేషన్ లో ఉగ్రవాదులు హతమయ్యారు.