Site icon NTV Telugu

Army Officer: శిక్షణా కేంద్రంలో ఆర్మీ అధికారి ఆత్మహత్య.. కారణమేంటంటే?

Army Officer

Army Officer

Army Officer Suicide: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో 43 ఏళ్వ ఇండియన్ ఆర్మీ కల్నల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.టెక్నికల్ ట్రైనింగ్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితులైన కల్నల్ నిషిత్ ఖన్నా మృతదేహం ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో శిక్షణా కేంద్రంలోని అధికారుల మెస్‌లోని ఒక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియాంక శుక్లా తెలిపారు.

ఉరేసుకుని చనిపోయిన ఆర్మీ అధికారి “క్షమించండి” అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. కల్నల్ ఖన్నా ఈ చర్య తీసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక దర్యాప్తు సూచించినట్లు సీఎస్పీ ప్రియాంక శుక్లా వెల్లడించారు. అక్టోబర్ 25, 2022 నుండి ఆర్మీ అధికారి తన భార్య, కుమారుడు, కుమార్తెతో సహా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆమె తెలిపారు.కల్నల్ ఖన్నా కుటుంబం అధికారుల ఎన్‌క్లేవ్‌లో నివసిస్తోందని పోలీసు అధికారి పేర్కొన్నారు.

China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం

గతవారం కూడా ఓ 29 ఏళ్ల ఇండియన్ ఆర్మీ కెప్టెన్ మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని పచ్‌మరి ఆధారిత ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version