బీహార్‌లోని ఆరా తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో దొంగలు రూ.25 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. పట్టపగలే జ్యువెలరీ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన దుండగులు.. బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలతో పాటు నగదును దోచుకుని పారిపోయారు. కాగా.. దొంగలు షోరూం సిబ్బంది, కస్టమర్లను తుపాకీతో బెదిరించి పరారైన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు షోరూమ్ తెరవగానే ఈ ఘటన జరిగింది. ముఖాలకు మాస్కులు, హెల్మెట్లు పెట్టుకుని ఐదారుగురు వ్యక్తులు షాపులోకి వచ్చారు.
Read Also: Somireddy: మంచి నాయకులు ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వస్తున్నారు..
దొంగలు షోకేస్ బాక్సులలో ఉంచిన ఆభరణాలను బ్యాగులలో తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఒక సిబ్బంది దొంగతనం జరుగుతున్న గదిలోకి వెళ్తుండగా.. ఇద్దరు దొంగలు అతన్ని పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా.. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి అతని దగ్గరున్న తుపాకీని దొంగలు తీసుకున్నారు. కాగా.. షోరూం సిబ్బంది ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. దొంగలు పారిపోతుండగా పోలీసులు వెంబడించి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు బుల్లెట్ తగిలాయి. దీంతో.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Jyothika: కంగువా కంటే చెత్త సినిమాలు చాలా వచ్చాయి.. నటి జ్యోతిక ఫైర్..
తనిష్క్ షోరూమ్‌లో ఐదు నుంచి ఆరుగురు నేరస్థులు దోపిడీకి పాల్పడ్డారని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించి త్వరలో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని భోజ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.