Site icon NTV Telugu

Aishwarya : పెళ్లయినా తగ్గేదేలే అంటున్న అర్జున్ కూతురు

New Project 2024 10 24t131614.660

New Project 2024 10 24t131614.660

Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వ‌ర్య‌ని స్టార్ హీరోయిన్ చేయాల‌ని ఇండ‌స్ట్రీకి పరిచయం చేశారు.`ప‌ట్ట‌త్తు యానై` అనే త‌మిళ సినిమా ద్వారా ఆమెను వెండితెర ఆరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత కన్నడ ఇండస్ట్రీలో ప్రేమ బ‌ర‌హా అనే సినిమా చేయించాడు. ఆ సినిమా తర్వాత వెంటనే `సొల్లి విడ‌వ` అనే సినిమా చేసింది. ఇన్ని సినిమాలు చేసినా కెరీర్ కు ఉపయోగపడే విధంగా స్టార్ డమ్ తెచ్చిపెట్టలేదు. ఆ సినిమాలన్నీ ఆయా ఇండస్ట్రీలో కొత్త సినిమా అవ‌కాశాలు తెచ్చి పెట్టలేదు. దీంతో అక్కడ లాభం లేద‌నుకున్న అర్జున్ సర్జా తన కూతురిని టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ఇక్కడ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన డైరెక్షన్లోనే ఓ సినిమా ప్రకటించాడు.

Read Also:Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్‌

అందులో కుమార్తెనే హీరోయిన్ గా ఎంచుకున్నాడు. త‌న కోసమే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షురూ చేశాడు. అయితే ఆ సినిమా విశ్వక్ సేన్ తో ఏదో వివాదం కారణంగా ఆ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఈ క్రమంలో ఐశ్వర్య త‌మిళ న‌టుడు తంబిరామ‌య్య కుమారుడితో లవ్ ఎఫైర్ నడిపింది. విష‌యం ఇంట్లో చెప్పి వారందరినీ ఒప్పించి తననే పెళ్లాడింది. ఐశ్వర్య పెళ్లి చేసుకోవడంతో ఆమె కెరీర్ క్లోజ్ అని అనుకున్నారంతా. కానీ పెళ్లి తర్వాత కూడా తాజాగా మ‌రో సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. `సీతా ప‌య‌నం` అనే కన్నడ సినిమా చేస్తుంది. ఇందులో ఉపేంద్ర బంధువు నిరంజ‌న్ అనే కుర్రాడు హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా అర్జున్ స్వీయా ద‌ర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. అయితే హీరోయిన్ అవ్వాలి అన్నది ఐశ్వ‌ర్య డ్రీమ్ నా? లేక తండ్రి క‌లా? అన్నది మాత్రం తెలీదు గానీ తన కూతురిని మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యేవరకు అర్జున్ మాత్ర‌వ విశ్ర‌మించేలా లేరు. అయితే తెలుగులో విశ్వక్ తో కుదరని సినిమానే క‌న్న‌డ‌లో మ‌రో హీరోతో చేస్తున్నారా? లేక అది కొత్త క‌థ అన్నది తెలియాల్సి ఉంది.

Read Also:CM Revanth Reddy: ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం..

Exit mobile version