మెలోడీ కింగ్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటనతో ఒక్కసారిగా సంగీత ప్రపంచం మూగబోయింది. అసలు పీక్ స్టేజ్‌లో ఉన్న అరిజిత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా? అని అందరూ ఆందోళన చెందుతున్న వేళ, ఆయన స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తను ఎందుకు రిటైర్మెంట్ ఎందుకు తిసుకున్నారో ట్వీట్ లో పేర్కోన్నారు..
Also Read : Arijit Singh : స్టార్‌డమ్ వచ్చినా అరిజిత్ మారలేదు.. చిన్మయి షాకింగ్ పోస్ట్
‘రిటైర్మెంట్ వెనుక ఒక కారణం లేదు.. చాలా ఉన్నాయి. నేను చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను, ఇన్నాళ్లకు ధైర్యం చేసి మీకు చెబుతున్నాను. నాకు ఎప్పుడూ కొత్తదనం అంటే ఇష్టం. అందుకే స్టేజ్ షోలలో కూడా నా పాత పాటలను కొత్తగా పాడుతుంటాను. ఇప్పుడు సంగీతంలో మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త గాయకుల పాటలు వింటే నాకు చాలా స్ఫూర్తిగా అనిపిస్తోంది. నేను తప్పుకుంటేనే కొత్త ప్రతిభ బయటకు వస్తుంది, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని అరిజిత్ వివరించారు.
అయితే ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెప్పిన అరిజిత్.. ఇండిపెండెంట్ సింగర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారని సమాచారం. అంటే సినిమాల్లో పాడకపోయినా, ఆయన సొంత ఆల్బమ్స్ ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు. రెండు నేషనల్ అవార్డులు, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న అరిజిత్.. తెలుగులో ‘మనం’, ‘నా పేరు సూర్య’ వంటి సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి మన మనసు గెలుచుకున్నారు. ఆయన నిర్ణయం సంగీత ప్రియులకు బాధ కలిగించినా, కొత్తవారి కోసం ఆయన చూపిస్తున్న ఉదారతకు అందరూ ఫిదా అవుతున్నారు.
