NTV Telugu Site icon

Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..

Parenting Tips

Parenting Tips

ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఒక కారణమైతే.. రోజురోజుకూ పిల్లల మారాం పెరిగిపోతుండటం మరో కారణం. అయితే.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. విదేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరం. కానీ, మన దేశంలో పిల్లల్ని సరిదిద్దేందుకు పేరెంట్స్ కొడతారు. భరించలేని కోపమొచ్చినప్పుడు ఓ చెంపదెబ్బ చాలు. అంతేకానీ, పదే పదే అదే పనిగా కొడుతుంటే అది వారి స్టడీస్, మెంటల్ కండీషన్, లైఫ్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల పెద్దయ్యాక పిల్లలు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పిల్లలను కొట్టకుండా మీ మాట వినాలంటే ఈ టిప్స్ పాటించండి..

READ MORE: Agri Gold Case: అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు.. పరిగణలోకి ఈడీ ఛార్జ్ షీట్‌

అందులో మొదటిది పిల్లల దృష్టిని ఆకర్షిస్తే గనుక వారు మీ మాట ఖచ్చితంగా వింటారు. అంటే మీ పిల్లల భుజం మీద చేత్తో తట్టడమో లేదా కళ్లతో వారితో మాట్లాడటం వంటి వాటి ద్వారా వారి దృష్టిని మీ వైపు తిప్పుకోండి. దీనివల్ల మీ పిల్లలు మీ మాట వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పేరెంట్స్ పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే మీ పిల్లలతో మీరు ఏదైనా చెప్పేటప్పుడు నవ్వుతూ, ప్రశాంతంగా వారికి చెప్పాల్సిన విషయాలను చెప్పండి. దీనివల్ల వాళ్లు మీరు చెప్పిన విషయాలను సులువుగా అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా సరే పిల్లలకు ఎక్కువ మాటలు చెప్పకండి. అంటే మీరు మీ పిల్లలకు ఏదైనా చెప్పాలనుకున్నా, వారితో ఏ పనైనా చేయించాలనుకున్నా తక్కువ మాటలు మాట్లాడండి. చాలా మాటలను పిల్లలు అర్థం చేసుకోలేరు.

READ MORE:Sunita Williams: క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం? శాస్త్రవేత్తల్లో ఆందోళన

మీరు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే ఎప్పుడూ కూడా కొన్ని మాటల్లోనే విషయాన్ని పిల్లలకు చెప్పండి. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇది. పిల్లలపై కోపం వస్తే చాలు అరిచి వారిని కొట్టడం వంటివి చేస్తుంటారు. ఒకవేళ మీ పిల్లలు మీరు చెప్పింది వినకపోతే వారిపై అరవకండి. దీనికి బదులుగా వారితో మర్యాదగా ప్రవర్తించండి. దీంతో వారు మీ మాట వినే అవకాశం ఉంది. పిల్లలు ఏదైనా పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేది వినకపోవచ్చు. అందుకని వారిపై వెంటనే అరవకుండా.. కొంత సేపటి తర్వాత మళ్లీ చెప్పండి. కొన్నికొన్ని సార్లు పిల్లలు ఒక విషయం నుంచి మరొక విషయంపై దృష్టి పెట్టడానికి సమయాన్ని తీసుకుంటారు. ఇలాంటప్పుడు వారితో మాట్లాడి కొంత సేపు ఆగండి. ఈ సమయంలో మీరు చెప్పేది మీ పిల్లలు అర్థం చేసుకుంటారు.