ఒకప్పుడు పొద్దున్నే లేవగానే వేప పుల్లలో, బొగ్గు, లేదా ఉప్పుతో పళ్ళను కడిగే వారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. దాంతో పాటుగా జనాల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దాంతో రకరకాల పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి.. పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా తయారు చేసిన పేస్ట్ ను వాడటం వల్ల శరీరంలో సోడియం పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
పళ్ళపై ఉండే పొర కూడా పోతుంది.. అందుకే వీటిని ఎక్కువగా వాడకపోవడం మంచిదని చెబుతున్నారు.. ఇక గర్భిణీలు ఈ పేస్ట్ లను ఎక్కువగా వాడితే చాలా ప్రమాదం.. బిడ్డ అభివృద్ధి పై ప్రభావం పడటంతో పాటుగా, నరాలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే ఇంట్లోనే పేస్ట్ను తయారు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
అయితే వెనిగర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, నిమ్మరసాన్ని చేర్చకూడదు. అవి పళ్లపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తాయి.. అందుకే సహజ పోషకాలు ఉన్న కొబ్బరి నూనెతో పళ్ళను కడిగితే మంచిది.. కొందరు వేప పుల్లను కూడా వాడుతారు.. పళ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గిస్తుంది. పేస్టులో సేజ్ ను చేర్చడం చాలా మంచిది. అది చిగుళ్లవ్యాధిని నయం చేస్తుంది. బేకింగ్ సోడాను కూడా వాడతారు.. ఏదైనా లిమిట్ గానే వాడి పళ్ళను శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.