NTV Telugu Site icon

Yoga: సన్నగా ఉన్నారా.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు..

Yoga

Yoga

సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఎలాంటి ఆహారం తీసుకున్న బరువు పెరగడం లేదా.. అయితే.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు. బరువు తగ్గడానికే కాదు.. పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల సహాయంతో మీరు మీ శరీర ఆకృతిని మార్చుకోవచ్చు. మీ దినచర్యలో ఈ యోగా ఆసనాలను చేయడం ద్వారా మీరు బరువు పెరగవచ్చు. ఇంతకీ ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Police Arrested: ప్రాణాంతక స్టంట్ చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..

భుజంగాసనం
రోజూ 15 నిమిషాల పాటు భుజంగాసనం చేయడం వల్ల కండరాలు సాగవుతాయి. అంతేకాకుండా.. భుజాలు, వీపు, ఛాతీ అలాగే నడుము పైభాగంలో కండరాలు పెరగడంలో సహాయపడుతుంది. భుజంగాసనం చేయడం వల్ల కండరాలు సాగడంతోపాటు కండరాల పరిమాణం పెరుగుతుంది. దీంతో.. శరీరం ఆకృతి మారడం ప్రారంభమవుతుంది.

మండూకాసనం
మండూకాసనం కూడా బరువు పెరగడానికి సహాయపడే ఒక భంగిమ. ఫ్రాగ్ పోజ్ చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ ఆసనం కడుపులోని అంతర్గత అవయవాలను ఉత్తేజపరుస్తుంది. ఇది నడుము, తుంటి కండరాలను సాగదీస్తుంది. అందువల్ల కండరాలు పెరిగి.. శరీర ఆకృతిని మార్చడంలో సహాయపడతాయి.

సర్వంగాసనం
సర్వగాసనం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని తినడం ద్వారా సులభంగా గ్రహించగలుగుతుంది. అందువల్ల.. సరైన జీర్ణక్రియ బరువు పెరగడానికి సహాయపడుతుంది.

ధనురాసనం
ధనురాసన సాధనలో శరీరంలోని దాదాపు అన్ని కండరాలు సాగదీయబడతాయి. సన్నగా ఉన్నవారు ఈ ఆసనం చేసినప్పుడు వారి కండరాలు సాగదీయబడతాయి. సరైన ఆహారం సహాయంతో ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. అయితే.. సన్నగా ఉన్నవారు యోగా సాధన చేయడంలో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి.. మంచి శిక్షకుడి సహాయంతో మాత్రమే ఈ యోగా ఆసనాలను సాధన చేయండి.