NTV Telugu Site icon

Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!

Breathing

Breathing

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి.. శ్వాసక్రియకు సహాయపడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో.. చాలా మంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యల బారిన పడినట్లయితే.. సమయానికి నిపుణుల నుండి సలహా తీసుకోండి. లేదంటే.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. మన గుండె, ఊపిరితిత్తులు రక్తం ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని కణజాలాలకు అందజేస్తాయి. అంతేకాకుండా.. కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపుతాయి. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.

Action on VRO: వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్

ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందని శ్వాసలోపం సమస్యను డిస్ప్నియా అంటారు. ఈ సమస్య వల్ల మీ ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో.. ఊపిరి పీల్చుకోవడానికి మీరు ఇబ్బంది పడుతారు. మీరు తరచుగా ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే, జాగ్రత్త వహించాలి. శ్వాస ఆడకపోవడం అనేది చాలా సందర్భాలలో ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలకు సంకేతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి.. ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో.. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తాయి.

తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల సమస్య:
శ్వాసలోపం సమస్య చాలా రోజుల పాటు ఉన్నట్లైతే.. అది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల సంకేతం. దీని వల్ల.. ఆస్తమా, ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలను ప్రభావితం చేస్తాయి. అలాగే.. శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది. దీనికి.. త్వరగా, దీర్ఘకాలిక చికిత్స అవసరం. అందువల్ల సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చాలా ముఖ్యం.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం:
నిరంతర శ్వాస సమస్యలు వల్ల కార్డియోమయోపతి (గుండె కండరాలలో సమస్య), గుండె వైఫల్యం లేదా పెరికార్డిటిస్ (గుండె చుట్టూ ఉన్న కణజాలం యొక్క వాపు) వంటి అనేక తీవ్రమైన గుండె జబ్బులకు సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని సకాలంలో పట్టించుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.

తీవ్ర భయాందోళన లేదా ఒత్తిడి సమస్య:
మానసిక ఒత్తిడి లేదా భయము కూడా ఆకస్మిక శ్వాసను కలిగిస్తాయి. తీవ్ర భయాందోళనలో శ్వాస సాధారణం కంటే వేగంగా మారుతుంది. దీంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరుగుతుంది. ఈ పరిస్థితులను సకాలంలో నిర్ధారించడం.. చికిత్స చేసుకోవడం చాలా ముఖ్యం.

Show comments