NTV Telugu Site icon

Eating Pulses: వర్షా కాలంలో ఈ పప్పులను తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం..!

Pulses

Pulses

పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. పప్పులలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో కొన్ని పప్పులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుందని, అందుకే జీర్ణం కావడానికి సమయం పట్టే వాటిని తినడం మానుకోవాలని అంటున్నారు. వర్షా కాలంలో గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం పెరుగుతుంది. అందువల్ల.. బయటి జంక్ ఫుడ్‌తో పాటు, ఆరోగ్యకరమైనదిగా భావించే కొన్ని పప్పులను కూడా మనం తినకూడదు. వర్షాకాలంలో తేమ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని పప్పులు అధిక పోషక విలువలను కలిగి ఉండటం వలన సులభంగా జీర్ణం కావని అంటున్నారు. ఇంతకీ వర్షాకాలంలో తినకూడని పప్పులు ఏంటో తెలుసుకుందాం.

Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
మినప పప్పు
మినప పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఈ పప్పులో 24 గ్రాముల ప్రొటీన్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పు వర్షాకాలంలో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ బీన్స్
భారతీయులకు రాజ్మా-రైస్ అంటే చాలా ఇష్టం. అందులో ప్రొటీన్, ఫైబర్, మినరల్స్, కాపర్ మరియు పొటాషియం ఉంటాయి. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిని.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీ బీన్స్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇది కడుపుకు హానికరం. కడుపులో గ్యాస్‌ను కలిగిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో దీన్ని తినకూడదు.

చిక్పీ పప్పు
ఈ పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును కాపాడుకోవడమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ దీన్ని తినడం వల్ల కొన్నిసార్లు జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వర్షాకాలంలో దీన్ని తినకూడదు.

వైట్ చిక్‌పీ
ఈ పప్పులో ప్రోటీన్, మెగ్నీషియం, ఇనుముతో పాటు విటమిన్ ‘సి’ మరియు ‘బి’ ఉంటాయి. చిక్‌పీలో ఫైబర్, పొటాషియం కూడా ఉంటాయి. అయితే దీనిని గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారం అని కూడా అంటారు. అంత తేలికగా జీర్ణం కాదు. ఒక రకమైన చక్కెర పదార్థం ఇందులో ఉంటుంది.

పప్పులు తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
మీరు పైన పేర్కొన్న పప్పులు తినాలనుకుంటే.. వాటిని రాత్రంతా నానబెట్టండి. వర్షాకాలంలో మూంగ్ పప్పుతో చేసిన పదార్థాలను తినవచ్చు. అయితే.. జీర్ణ సమస్యలు కలిగి ఉంటే, వారు వర్షాకాలంలో ఈ పప్పులను తినకూడదు. మీరు వీటిని తింటే వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవాలి.