NTV Telugu Site icon

Chapati: చపాతీలు తింటే మంచిది.. రాత్రి చేసినవి పొద్దున తింటే ఇంకా మంచిది

New Project (66)

New Project (66)

chapati:ప్రజల జీవ‌న శైలి ఏ రోజు కా రోజు మారుతూ ఉంది. ఇలా మారడం మూలంగా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం చాలా మందిని ప‌ట్టి పీడిస్తున్న స‌మస్య అధిక బరువు(ఒబేసిటీ). ఇది చాలా కామన్ అయిపోయింది నేడు. రెగ్యుల‌ర్ డైట్‌లో ఎక్కువ క్యాల‌రీలు తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వల్ల చాలా మంది ఒబేసిటీ బారిన ప‌డుతుంటారు.ఇది చాలా ప్ర‌మాద‌మని నిపుణులు ప‌రిగ‌ణిస్తున్నారు.చాలా మంది బరువు తగ్గేందుకు రాత్రి పూట అన్నం బ‌దులు చ‌పాతీలు,జొన్న‌,రాగీ రొట్టెలు తింటున్నారు. ఎక్కువ‌ మంది చ‌పాతీల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అన్నం బ‌దులు చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల కలిగే ప్రయోజనాలు తెల్సుకుందాం..

Read Also:Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు

చ‌పాతీల‌ను త‌యారు చేసే గోధుమ‌పిండిలో విట‌మిన్ బీ,ఇ,కాల్షియం,ఐర‌న్‌,జింక్‌,సోడియం,పోటాషియం,మెగ్నిషియం వంటి మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అన్నం తిన‌డం వ‌ల్ల ఎంత శ‌క్తి ల‌భిస్తుందో చ‌పాతీల వ‌ల్ల కూడా అంతే ఎన‌ర్జీ ల‌భిస్తుంది.కానీ అన్నం కంటే చ‌పాతీ త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.చ‌పాతీలను నూనె లేకుండా లేదంటే త‌క్కువ నూనె వేసి కాల్చ‌డం వ‌ల్ల అన్నంలో పోల్చిన‌ప్పుడు కాస్త త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి.అంతేకాదు.. రెండు, మూడు చ‌పాతీలు తిన‌గానే క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది. దీంతో త‌క్కువ ఆహారం తీసుకుంటాం.ఫ‌లితంగా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతాం అంటున్నారు నిపుణులు.

Read Also: Crime News:కేసు విషయంలో స్టేషన్‎కు తీసుకుపోతే.. పోలీసులపై బాంబ్ వేసి పరారయ్యాడు

చాలా మంది రాత్రి పూట చపాతీలను చేసుకుంటూ ఉంటారు అయితే ఉదయం ఒక్కొక్క సారి అవి మిగిలిపోతూ ఉంటాయి. వాటిని తింటూ ఉంటారు. మిగిలిపోయిన చపాతీలను తినడం వలన ఎన్నో లాభాలు పొందొచ్చు. మిగిలిపోయిన చపాతీలు తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి.రాత్రి చేసుకున్న రోటీలని ఉదయం పూట పాలల్లో వేసుకుని తీసుకుంటే కడుపునొప్పి సమస్య ఉండదు. గ్యాస్,కాన్స్టిపేషన్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి.డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.హై బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండేందుకు ఇది సహాయపడుతుంది. వీటిని తీసుకునే ముందు పాలల్లో నానబెట్టుకుని తీసుకోవడం మంచిది. మిగిలిపోయిన రోటీలని తీసుకోవడం వలన బాడీ టెంపరేచర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.