Site icon NTV Telugu

Off The Record: అనంతపురం పాలిటిక్స్‌లో బాహుబలి కేరక్టర్స్‌.. ఇన్నాళ్ళు కట్టప్పలు కామనైపోగా…

Ananthapuram

Ananthapuram

ఆ జిల్లాలో బాహుబలి సినిమా కేరక్టర్స్‌ తెగ తిరిగేస్తున్నాయి. ఇన్నాళ్ళు కట్టప్పలు కామనైపోగా… ఇప్పుడు కొత్తగా బిజ్జలదేవలు కూడా మొదలైపోయి రన్‌ రాజా రన్‌ అంటున్నారు. వెన్నుపోట్లు, పదవుల కోసం కక్కుర్తి, కాంప్రమైజ్‌ లాంటి మాటలు తెగ పేలుతున్నాయి. ఏ నలుగురు కలిసినా ఇలాంటి చర్చే జరుగుతోంది ఏ జిల్లాలో? అక్కడ కొందరు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉన్న ఫెవికాల్‌ బంధమేంటి?

Also Read:Hyderabad JNTU University: విద్యార్థుల నుంచి డబ్బులు గుంజేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ కీలక నిర్ణయం!

రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు కామన్‌. వెన్నుపోట్ల గురించైతే చెప్పేపనేలేదు. పైకి కనిపించేవి కొన్ని. కనిపించవిని ఎన్నో. ఇక బాహుబలి సినిమా వచ్చాక వెన్నుపోటు దారుల్ని కట్టప్పలతో పోలుస్తూ చాలాచోట్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడిక అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం వంతొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నాయకులు పరస్పరం బాహుబలి కేరక్టర్స్‌తో పోల్చుకుంటూ నిందారోపణలు చేసుకోవడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఉన్నట్టుండి సినిమా కేరక్టర్స్‌ పొలిటికల్ స్క్రీన్‌ మీదికి ఎందుకు వచ్చాయంటే… బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ బాగా పెద్దగానే ఉందట. ఇటీవల కొందరు నాయకులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంపైపోయారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచన చేరడం కొందరు చోటామోటా నాయకులకు కామన్‌ అనుకుంటున్న టైంలో… మేటర్‌ కొత్త టర్న్‌ తీసుకుంది.

పార్టీ మారిపోయిన వాళ్ళు నిన్నటిదాకా తాము నాయకుడుగా భావించిన వాళ్ళ కింద గోతులు తీయడం మొదలుపెట్టారట. సన్నిహితంగా మెలిగిన టైంలో తెలుసుకున్న కొన్ని బలహీనతల్ని బయటపెడుతూ పరువు తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే… వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా డిఫరెంట్‌గానే ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. ఆదాయ వనరులు చూపలేదని చెబుతూ…అలాంటి వాళ్లని ఆడుకోవడానికి ఇప్పుడు టైం దొరికింది. ఏం… మాకు ఆ మాత్రం కడుపుమంట ఉండదా అంటున్నారట. ఆ జంపింగ్‌ జపాంగ్స్‌ ఉద్దేశ్యం ఏదైనా…వాళ్ళు ఇస్తున్న సమాచారం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతోందన్న చర్చ నడుస్తోంది.

ఇదే సమయంలో కేవలం పార్టీ మారిన వారు మాత్రమే ఇలా చేయడం లేదని, కొందరు వైసీపీలో ఉంటూనే.. టీడీపీ కోవర్ట్‌లుగా పని చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉండగా….ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారి వ్యవహారాలను ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ.. వైసీపీ నేతలే టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయుధాలు అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. మాజీ ఎమ్మెల్యేల సంపాదన మార్గాలు, ఇతరత్రా వ్యవహారాలను కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు లీకులిస్తూ కొరకరాని కొయ్యగా మారిపోతున్నారట.

మొన్నటి వరకు ఇలాంటి విషయాలని మాజీలు పెద్దగా పట్టించుకోలేదుగానీ… ఇటీవల ఈ కట్టప్పల వ్యవహారం ఎక్కువ కావడంతో అలర్ట్ అవుతున్నారట. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారు బహిరంగంగానే మా పార్టీలో కొందరు కట్టప్పలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కట్టప్పలతో ఇక్కడి నుంచి పోయినవారు నిత్యం టచ్ లో ఉంటూ చేటు చేస్తున్నారని అన్నారాయన. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే… ఎవరైతే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లు కూడా రివర్స్ కౌంటర్స్‌ వేస్తున్నారు. మమ్మల్ని కట్టప్పలని భావిస్తే…. మీరు బిజ్జల దేవలు ఇంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read:Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్

అధికారం కోసం ఏమైనా చేస్తారని, సొంత పార్టీ కార్యకర్తలను కూడా బలి చేసేందుకు సిద్ధమవుతారన్నది వాళ్ళ అభిప్రాయం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అక్రమ సంపాదనల కోసం పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి… ఏమైనా చేయగలరని అంటున్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఈ డిస్కషన్ జోరుగా నడుస్తోంది. ఈ కట్టప్పలు, బిజ్జల దేవలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు తెర తీస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version