Site icon NTV Telugu

Mumbai: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి అర్చన పాటిల్!

Ex Home Ministet

Ex Home Ministet

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాషాయ గూటికి చేరారు. తాజాగా మరో ముఖ్యనేత కోడలు కూడా బీజేపీలో చేరనున్నారు. ముంబైలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ చకుర్కర్ భేటీ అయ్యారు. శనివారం ఆమె ముంబైలో బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికల వేళ అశోక్ చవాన్ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆయన అలా చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చారు. కేసుల్లో భాగంగానే ఆయన పువ్వు పార్టీలో చేరారని ఆరోపణలు వచ్చాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ కోసం బీజేపీకి మద్దతు తెల్పాలని ప్రధాని కోరారు.

ఇది కూడా చదవండి: Dear: హీరోగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆరోజే రిలీజ్!

ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న జరగనుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. 2024లో అధికారమే లక్ష్యంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతున్నాయి. మరీ విజయం ఎవర్నీ వరిస్తుందో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: Bijay Chetri: లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు..! 

 

Exit mobile version