Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు. యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాల అనంతరం అనంతరం శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు జనసేన దిగడం గమనార్హం.
Read Also: Nallamilli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లితో బీజేపీ నేతల మంతనాలు
రైల్వేకోడూరులో గతంలో ప్రకటించిన యనమల భాస్కరరావుపై పలు ఆరోపణ రావడంతో అభ్యర్థిని మార్చింది. టీడీపీ ఇన్చార్జ్ ముక్కా. రుక్మానందరెడ్డి గత అభ్యర్థి విషయంలో అభ్యంతరాలు తెలపడంతో, జనసేన అభ్యర్థిని మార్చింది. వైసీపీ కోవర్ట్‌కు టికెట్ ఇచ్చారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక వ్యక్తులకే టికెట్ ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబట్టారు. దీనికి తగ్గట్టుగా జనసేన అధిష్టానం గత మూడు రోజుల క్రితం టీడీపీ నుంచి జనసేనలో చేరిన అరవ శ్రీధర్‌కు టికెట్ కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది.