Site icon NTV Telugu

Arasan: శింబు ‘అరసన్ ’ లోకి మరో స్టార్ హీరో ఏంట్రీ..

Arasan

Arasan

కోలీవుడ్ స్టార్ శింబు (STR) హీరోగా, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న సినిమా ‘అరసన్’ మీద అప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. శింబు కెరీర్‌లో 49వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అరసన్’ అంటే “రాజు” అన్న అర్థం. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందనే హింట్ ఇస్తున్నాయి. ఈ సినిమా ‘వడ చెన్నై యూనివర్స్’ లో భాగమని కూడా టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా సమంతను తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Also Read : Dharmendra : హేమమాలినితో రెండో పెళ్లికి వెనకున్న నిజాలు, అప్పటి హాట్ టాపిక్స్.. !

ఇప్పుడు ఈ మూవీ మీద హైప్‌ని రెండింతలు పెంచే అప్‌డేట్ వచ్చేసింది! ‘అరసన్’ లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చేశారు. అవున్, అదే విజయ్‌ సేతుపతి! పాత్ర పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే, ఆయన ఏ రోల్‌లో అయినా పూర్తిగా లీనమవ్వడం తెలిసిందే. తాజాగా ఆయన గెటప్‌ని రివీల్ చేస్తూ టీమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్‌లోకి వెళ్లిపోయారు. వెట్రిమారన్ – శింబు – విజయ్ సేతుపతి కాంబో స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి కోలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది.

Exit mobile version