NTV Telugu Site icon

AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..

Ar Rehaman

Ar Rehaman

AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు మీద ముంబై రోడ్ల వెంబడి వాంఖడే మైదానానికి చేరుకున్నారు. అక్కడ లక్షలాది మంది అభిమానులు వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా అభిమానులు కూడా టీమ్ మొత్తానికి ముక్తకంఠంతో స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు.

Mount Etna Volcano: పేలిన భారీ అగ్నిపర్వతం.. బూడిదమయమైన ఇటలీలోని విమానాశ్రయం..

ఈ సందర్భాన్ని పునస్కరించుకొని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తాను భావోద్వేగానికి లోనైనట్లుగా తాను చేసిన పోస్టు ద్వారా వివరించాడు. ముంబైలోని వాంఖడే మైదానానికి టీం ఇండియా చేరినప్పుడు.. అక్కడ వందేమాతరం పాటను ప్లే చేయగా విరాట్ కోహ్లీ తోపాటు టీం సభ్యులు, అలాగే స్టేడియంలోని మొత్తం ప్రజలందరూ వందేమాతరం పాటను ఒక్కసారిగా పెద్దగా పాడడంతో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు. అయితే తాను పాడిన పాటను ఇలా అందరూ స్వరపరచడం తనకు ఎంతో భావోద్వేగాన్ని గురిచేసిందని తెలిపారు. తను ఈ పాటను 1997లో స్వరపరిచినట్లు తెలుపుతూ.. ఈ పాటను తాను ఎప్పుడూ విన్నా కానీ భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ పాట కంపోజ్ చేసి 27 సంవత్సరాలు గడుస్తున్నా కానీ జాతీయ గీతం సంబంధించిన పాట కాబట్టి.. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

i-utsavas-and-saree-mahotsavam-in-kanakadurga-temple-from-today-630113.html”>Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..