NTV Telugu Site icon

Sankranti Special Buses: సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..

Apsrtc

Apsrtc

సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా.. ఎటువంట అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండగ దృష్ట్యా.. 7,200 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఏపీఎస్ ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంది.

Read Also: TPCC Mahesh Goud : బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడి.. టీపీసీసీ సీరియస్

మరోవైపు.. సంక్రాంతికి ముందు 3,900 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్ ఆర్టీసీ.. హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు 375, చెన్నై 42, విజయవాడ 300, విశాఖపట్నం 250, రాజమండ్రి 230, తిరుపతి 50, ఇతర ముఖ్య ప్రాంతముల నుండి 500 బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే.. తిరుగు ప్రయాణమునకు 3,300 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఒకే సారి రాను పోను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10 శాతం రాయితీ కూడ కల్పించనున్నారు. ఈనెల 8 నుండి 13 వరకు, సంక్రాంతి తరువాత 16 నుండి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

Read Also: Kerala: సీపీఎం నేత హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు యావజ్జీవం..

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ సహా.. ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, 16 నుంచి 20వ తేదీన వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అయితే.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. రోజు వారీగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని తెలిపింది.

Show comments