APPSC: నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రేపటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఆన్ లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566గా ఉన్నాయి.. ఇక, 2024 ఫిబ్రవరి 25న గ్రూప్ -2 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులు వెబ్ సైట్ https://psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Vinay Bhaskar: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..
కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదలైంది. గ్రూప్-II పోస్టులకు నోటిఫికేషన్ లో 897 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ స్థానాలకు అభ్యర్థులను నియమించుకోవడానికి నిర్వహించే వార్షిక పరీక్ష.. ఇది మూడు దశల్లో నిర్వహిస్తారు, మొదటిది ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్ మరియు చివరిగా కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష ఉంటుంది.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సహాయ అభివృద్ధి అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III, పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.. అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.. దశ 1- ప్రిలిమినరీ పరీక్ష, దశ 2- మెయిన్స్ పరీక్ష, దశ 3- కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష, దశ 4- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షని 2024 ఫిబ్రవరి 25 న నిర్వహించనున్నారు. గ్రూప్ 2 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేస్తారు.. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి చెందిన వారు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది.
