NTV Telugu Site icon

APPSC : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

Tspsc Aee Exam

Tspsc Aee Exam

రాష్ట్ర వ్యాప్తంగా ఎపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాతంగా జరుగుతోంది. విజయవాడ లోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు అధికారులు. పరీక్ష జరుగుతోన్న తీరును ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పరిశీలింలించారు. ఈ సందర్భంగా ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సారి అత్యధికంగా 1.48 లక్షల మంది అప్లై చేశారని, 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్వామన్నారు. ఇవాల్టి పరీక్షలో 72.3 శాతం హాజరు నమోదైందని ఆయన వెల్లడించారు. 6145 కెమేరాలతో , లైవ్ టీ వీ స్ట్రీమింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని సవాంగ్‌ తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో కోర్టుల్లో లిటిగేషన్ అనేది పార్ట్ ఆప్ ది ప్రాసెస్ అని, చరిత్ర చూస్తే కోర్టులో లిటిగేషన్ లేకుండా ఎక్కడా ప్రాసెస్ జరగలేదన్నారు.

 Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్.. పవర్ స్టార్ డబ్బింగ్ టీజర్ కోసమేనా..?

హైకోర్టు ఇచ్చిన కోర్టు ఆర్డర్ కాపీని చదివాం… అప్పీల్ చేసుకునేందుకు మాకు చాలా అవకాశాలున్నాయని, ఉద్యోగాలు చేస్తోన్న 162 మంది ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సవాంగ్‌ తెలిపారు. చంద్రబాబు సహా రాజకీయ పార్టీలుచ చేసిన ఆరోపనలకు నేను స్పందించనని, 2018 గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష, నియామకాల్లో అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్1మెయిన్స్ రద్దుతో ఎపీపీఎస్సీ పై మాయని మచ్చ పడిందని నేను అనుకోవడం లేదని, ఇవాల్టి గ్రూప్ 1సహా ఇటీవల జరిగిన గ్రూప్ 2 నూ వాయిదా వేసేందుకు విఫలయత్నం చేశారన్నారు. వ్యాల్యువేషని ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేశాం.. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయన్నారు.