Janasena: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. ఈ కమిటీలో బి.మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్, వములపాటి ఆజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. మరెడ్డి శ్రీనివాస్ పరాపురం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు చూడనున్నారు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో సమాయత్తం కావడం, సమన్వయం, ప్రచార వ్యవహారాలు నుంచి పోల్, బూత్ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కమిటీ సభ్యులతో ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు.
Read Also: Malladi Vishnu: వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారు..