Site icon NTV Telugu

NTPC: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్ జాబ్స్ రెడీ..

Jobs

Jobs

చదువు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధిస్తే మీతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కూడా మార్చేయొచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీచేయనున్నారు.

Also Read:Saif Ali Khan : ఆ దేశంలో ఇల్లు కొన్న సైఫ్‌.. ఫ్యామిలీతో అక్కడికే షిఫ్ట్..

అభ్యర్థులు పోస్ట్ ప్రకారం BE/BTech/ME/MTech/MBA/PG డిప్లొమా/CA/CM/ సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అభ్యర్థికి సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. అయితే, రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

Also Read:Saif Ali Khan : ఆ దేశంలో ఇల్లు కొన్న సైఫ్‌.. ఫ్యామిలీతో అక్కడికే షిఫ్ట్..

జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/XSM కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 6 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version