Site icon NTV Telugu

Assistant Commandant Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్.. నెలకు రూ. 1.2 లక్షల జీతం

Indain Coast Gaurd

Indain Coast Gaurd

మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అస్సలు వదులుకోకండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి వరకు గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సమానమైన సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Also Read:

టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేసే సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఇస్తారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ ఐదు దశలను కలిగి ఉంటుంది. స్టేజ్-Iలో రాత పరీక్ష ఉంటుంది. స్టేజ్-IIలో కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్‌తో కూడిన ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ (PSB), స్టేజ్-IIIలో మానసిక పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూతో కూడిన ఫైనల్ సెలక్షన్ బోర్డ్ (FSB), స్టేజ్-IVలో ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి వైద్య పరీక్ష ఉంటుంది.

Also Read:Samantha : సమంత.. రాజ్ ప్రేమ ఒప్పుకున్నట్టేనా?

స్టేజ్-V అనేది ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ కమాండెంట్‌లుగా చేరే చివరి ఇండక్షన్ దశ. అసిస్టెంట్ కమాండెంట్ రూ. 56,100, డిప్యూటీ కమాండెంట్: రూ. 67,700, కమాండెంట్ (జెజి) రూ. 78,800, కమాండెంట్ రూ. 1,23,100 జీతం అందిస్తారు. అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. SC/ST అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 23 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version