NTV Telugu Site icon

Income Tax Recruitment 2025 : స్పోర్ట్స్ బాగా ఆడుతారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ. 81 వేల జీతం

Jobs

Jobs

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోపాటు స్పోర్ట్స్ పై కూడా పట్టు ఉంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. హైదరాబాద్‌ లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టు్ల్లో స్టెనోగ్రాఫర్‌-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్ 28, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 26 ఉన్నాయి.

Also Read:Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..

అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో పతక విజేతలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతక విజేతలు అప్లై చేసుకోవచ్చు.

Also Read:Mad Square Director : ఈ స్థాయి అస్సలు ఊహించలేదు.. నాకు అత్యుత్తమ ప్రశంస అదే!

స్పోర్ట్స్‌ విభాగాలు.. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బిలియర్డ్స్‌ అండ్ స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్‌, బ్రిడ్జి, క్యారమ్స్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌, టేబుల్ టెన్నిస్‌, వాలీబాల్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి రూ. 81 వేల వరకు జీతం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 5 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.