Site icon NTV Telugu

CISF: స్పోర్ట్స్ బాగా ఆడతారా? హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే ఛాన్స్.. 403 ఉద్యోగాలు రెడీ.. రూ. 81 వేల జీతం

Cisf

Cisf

స్పోర్ట్స్ బాగా ఆడేవారికి సువర్ణావకాశం. హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా ప్రతిభావంతులైన క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు.

Also Read:Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..

దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు23 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుదారులు అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ స్థాయి టోర్నమెంట్లలో (జూనియర్ లేదా సీనియర్ కేటగిరీలో) పాల్గొని ఉండాలి. ఈ అర్హత నిబంధనలు జట్టు ఆధారిత, వ్యక్తిగత క్రీడా విభాగాలు రెండింటికీ వర్తిస్తాయి. శారీరక పరీక్ష, స్పోర్ట్స్ లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read:Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..

ట్రయల్ టెస్ట్, ప్రావీణ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 25,500-రూ. 81,100 జీతం అందిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళా కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 6 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version