మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2026 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతం భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోగలగాలి. దరఖాస్తు ఫీజు SC/ST/PwBD/మాజీ సైనికులకు రూ. 50 + GST, జనరల్/OBC/EWS వారికి రూ. 450 + GSTగా నిర్ణయించారు.
Also Read:Delhi: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆపరేషన్ సిందూర్ శకటం ప్రదర్శన.. ఆసక్తిగా తిలకించిన వీక్షకులు
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్షలు, వీటిలో తార్కికం, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, సంఖ్యా సామర్థ్యం ఉంటాయి. దీని తర్వాత, అభ్యర్థులను భాషా ప్రావీణ్యత పరీక్షకు పిలుస్తారు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 24,250/- ప్రారంభ మూల వేతనాన్ని పొందుతారు. రూ.24250 – 840 (4) – 27610 – 980 (3) – 30550 – 1200 (3) – 34150 -1620 (2) – 37390 – 1990 (4) – 45350 – 2700(2) – 50750 – 2800 (1) – 53550 స్కేల్‌లో. ఎప్పటికప్పుడు వర్తించే ఇతర భత్యాలను కూడా పొందుతారు.
Also Read:Rakul Preet: బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
ప్రస్తుతం, ఆఫీస్ అటెండెంట్లకు ప్రారంభ నెలవారీ స్థూల వేతనం (ఇంటి అద్దె భత్యం లేకుండా) సుమారుగా నెలకు రూ.46,029/- ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్‌బిఐ ప్రకారం, పరీక్షకు తాత్కాలిక తేదీలు ఫిబ్రవరి 28- మార్చి 1 మధ్య ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
