NTV Telugu Site icon

Telangana Govt: ఆరు గ్యారెంటీల అమ‌లు.. ఈ నెల 28 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ

Congress Six Garenties

Congress Six Garenties

Telangana Govt: ఆరు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో జిల్లా కలెక్టర్లు, అధికారులతో స‌మావేశం ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు. జిల్లా అధికారుల నుంచి మండల అధికారుల వరకు జిల్లా యంత్రాంగం ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రజా పాలనను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం నిర్వహణకు నియోజకవర్గాల వారీగా ఆర్డీఓలు, మండలాల వారీగా జిల్లా అధికారులు, మున్సిపల్ వార్డుల వారీగా అధికారులను నియమించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్లను ఆదేశించారు.

Read also: Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?

జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఛాయౌట, రైతు భరోసా తదితర పథకాల (ఆరు హామీలు) కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు ధాపాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆరు హామీలను అందించేందుకు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, పట్టణ స్థాయిలో వార్డు కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి. కార్యక్రమాల తేదీలు, సమయాలను ముందుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?

Show comments