Site icon NTV Telugu

TS Liquor Tenders: తెలంగాణలో మద్యం టెండర్లకు ముగిసిన గడువు

Liquor

Liquor

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్లకు గడువు ముగిసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య లక్ష దాటినట్లు తెలుస్తుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల అంచనాకు మించి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం టెండర్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, చివరి రోజు అయినా.. నేడు ( శుక్రవారం ) 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్‌లో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అబ్కారీ శాఖకు రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. టెండర్ ప్రక్రియ ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం లభించింది.

Read Also: Paluke Bangaramayena: జానకి కలగనలేదు కానీ.. పలుకే బంగారమాయెనా..?

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు రాగా.. గత ఏడాది 79 వేల దరఖాస్తులు వచ్చాయి.. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు ఈ సంవత్సరం పెరిగాయి. ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పండింది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి.

Read Also: Minister Niranjan Reddy: ఆదాయం ఎలా సృష్టించవచ్చో తెలిసిన వ్యక్తి కేసీఆర్

ఇక, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలోని వైన్ షాపులకు రికార్డు స్థాయిలో అప్లికేషన్ లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 59షాపులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 2000 ధరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో కంటే రెండింతలు పోటీ పెరిగింది. షాపులు దక్కించుకునేందుకు సిండికేట్ గా వ్యాపారులు ఏర్పడ్డారు. ఓ వ్యాపారి తన భాగస్వాములతో కలిసి 999 దరఖాస్తులు దాఖలు చేసినట్లు సమాచారం. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో పరిగి, మోమిన్ పేట్ పరిధిలోని వైన్ షాపులకు భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు.

Exit mobile version