NTV Telugu Site icon

Eating Apple: యాపిల్స్ ఈ వ్యక్తులు అస్సలు తినకూడదు.. జాగ్రత్త సుమా!

Apples

Apples

రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు. ఒకవేళ తింటే ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఇంతకీ ఏయే వ్యక్తులు యాపిల్‌ను ఎక్కువగా తినకూడదో తెలుసుకుందాం.

Divyendu Sharma: స్వాతంత్ర్యానికి అసలు అర్థం చెప్పిన మీర్జాపూర్ మున్నా భాయ్..

అలెర్జీలు
కొంతమందికి యాపిల్ తినడం వల్ల అలర్జీ వస్తుంది. వారికి యాపిల్ తిన్న తర్వాత చర్మంలో దురద, దద్దుర్లు, వాపులు వస్తాయి. అలాంటి వారు యాపిల్ తినకూడదు.

ఊబకాయం
స్థూలకాయంతో బాధపడుతున్న వారు యాపిల్స్‌ను ఎక్కువగా తినడం మానేయాలి. యాపిల్‌లో ఉండే కేలరీలు.. చక్కెర మీ బరువును మరింత పెంచుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. తక్కువగ మోతాదులో మాత్రమే తినాలి.

అతిసారం
డయేరియాతో బాధపడేవారు కూడా ఆపిల్స్ తినకూడదు. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. దానివల్ల యాపిల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్య మరింత పెరుగుతుంది.

మధుమేహం
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా యాపిల్స్‌ను ఎక్కువగా తినకూడదు. యాపిల్స్‌లో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు యాపిల్‌ను వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

జీర్ణ సమస్యలు
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు యాపిల్‌ను ఎక్కువగా తినడం మానేయాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ యాపిల్‌ను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్‌, కడుపు నొప్పి.. తిమ్మిర్లు వస్తాయి.