NTV Telugu Site icon

Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌!

Iphone 14

Iphone 14

Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్‌ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్‌లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను కంపెనీ అందించనుంది.

అన్ని మొబైల్ ఛార్జర్లను ఒకేలా రూపొందించాలనే ప్రతిపాదనలతో యూరోపియన్ యూనియన్ కొత్త బిల్లును ఆమోదించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అన్నీ స్టాండర్డ్ యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, టెక్నాలజీని అందించాల్సిన వస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా 15 సిరీస్ ఫోన్లను టైప్ సీ పోర్ట్స్‌తో రూపొందిస్తోంది. 14 మోడళ్లను కూడా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లతో అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: Ravi Shastri: నాలుగో స్థానంకు ఊహించని పేరు.. రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా?

యూరోపియన్ యూనియన్ కొత్త బిల్లుప్రకారం.. అన్ని మొబైల్ కంపెనీలు 2024 చివరి వరకు తమ కొత్త ప్రొడక్ట్స్‌ను యూఎస్‌బీ టైప్ సీతో లాంచ్ చేయాలి. అందుకే ఈ ఏడాది రానున్న ఐఫోన్ 15 సిరీస్, వచ్చే ఏడాది రానున్న 16 సిరీస్‌లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందిస్తోంది. మరోవైపు ఐఫోన్ 14 మోడళ్లను కూడా యూఎస్‌బీ టైప్ సీతో యాపిల్ కంపెనీ రీలాంచింగ్ చేయనుంది. అయితే 14 మోడల్స్ ఎప్పుడొస్తాయనే దానిపై సమాచారం లేదు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ ఉండనుంది.

 

Show comments