NTV Telugu Site icon

Apple Event 2024 Live Updates: ఐఫోన్‌ 16 సిరీస్ ఫోన్లు.. అదిరే ఫీచర్స్ .. లైవ్‌ అప్‌డేట్స్

Apple

Apple

Apple Event 2024 Live Updates: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘యాపిల్’ ఐఫోన్‌ 16 సిరీస్ లాంచ్‌ కానుంది. కాలిఫోర్నియా ఆపిల్ పార్క్‌లోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో యాపిల్‌ ఈవెంట్‌ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరగుతోంది. ఈ ఈవెంట్‌ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమైంది. భారతదేశంలో యాపిల్ కంపెనీ వెబ్‌సైట్, ఆపిల్‌ టీవీ, యాపిల్‌ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ సహా యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. మునుపటి మాదిరే 16 సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌లను యాపిల్ ప్రకటించనుంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్‌ బటన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ యాక్షన్‌ బటన్‌ను ఇచ్చారు. 16 సిరీస్‌లో అన్నిమోడళ్లు లేటెస్ట్‌ జెన్‌ హార్డ్‌వేర్‌, ఏఐతో రానున్నాయి. యాపిల్ బిగ్ ఈవెంట్‌.. లైవ్‌ అపడేట్స్ మీకోసం..