NTV Telugu Site icon

Tips For Best Skin : యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో‌‌ ఇలా చేస్తే.. అక్కడ చర్మం మెరిసిపోతుంది..

Apple

Apple

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వంటిల్లే ఓ ఔషదాల నిలయం. మనం రోజూ తినే పండ్లు, కూరగాయలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందులో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఒకటి. యాపిల్‌ను ఇష్టపడటానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో తరచుగా పట్టించుకోని విషయం ఏంటంటే.. మీ చర్మం మరియు జుట్టుకు అందించే ప్రయోజనాలు. యాపిల్స్ మీ విటమిన్ సి స్థాయిలను పెంచుతాయి. దీనిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మీ శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో రాగి, మెలనిన్-కలిగిన మినరల్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని UV కిరణాలు రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read : New Al Qaeda Chief: అల్‌ఖైదా కొత్త చీఫ్‌ తలపై భారీ రివార్డు.. ఇరాన్‌లోనే ఉన్నాడా?

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. దీంట్లో ఉంటే.. కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్ , కాపర్, మాంగనీస్ మన ఆరోగ్యాన్ని భద్రపరచడంలో ఎంతో ఉపయోగపడుతాయట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ ఉండటం చేత.. ప్రతి రోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా.. బరువు తగ్గుతారు. దీంతో పాటు.. రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గి.. బాడీకి ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.

Also Read : Betting Racket Busted : గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడులు

యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్క్రబ్‌ (యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ – 4 టేబుల్ స్పూన్లు, తేనె – 1 చెంచా, గ్రీన్ టీ – 1 చెంచా, చక్కెర – 2 స్పూన్లు, నీళ్లు – కావలసినంత)లా కూడా ఉపయోగించి మొటిమలకు చెక్‌ పెట్టవచ్చు. చర్మంలోని టాక్సిన్స్‌ను తొలగించేందుకు కూడా ఈ స్ర్కబ్‌ పని చేస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, నల్లటి మచ్చలను తొలగిస్తుంది. సాధారణంగా మనం ముఖానికి ఆవిరి పట్టేటప్పుడు నీరు, రోజ్ వాటర్ ఉపయోగిస్తాము. వీటి స్థానంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ చర్మం లోతుగా చొచ్చుకుపోయి మలినాలను బయటకు పంపించడమేకాకుండా.. మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ మీ ముఖంపై రానివ్వవు.

అర చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ఒక చెంచా తేనెలో మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. చర్మం పీహెచ్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరించడం వల్ల కూడా చర్మ రంధ్రాలు కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం యాపిల్ సైడర్ వెనిగర్‌, నీళ్లు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకొని కాటన్‌ బాల్‌ సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.