APPA President Venkat Rami Reddy: ఉద్యోగులకు మేలు చేశా.. అందుకే మళ్ళీ గెలిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండోసారి ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్-అప్సా అధ్యక్షునిగా ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అప్సా కార్యాలయంలో కేక్ కట్ చేసిన వెంకట్రామి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అందచేశారు ఉద్యోగులు. ఈ సందర్భంగా అప్పా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఎన్నికల్లో నాపై నమ్మకంతో గెలిపించారు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఉద్యోగులకు నా వంతు మేలు చేశాను. ఇప్పుడు అందుకే నన్ను మళ్ళీ గెలిపించారు. నా విజయంతో ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలమని ఒప్పుకుంటారా..?
నన్ను ఓడించడానికి చాలా మంది ప్రయత్నించారు. నన్ను ఎంత టార్గెట్ చేసినా.. ఉద్యోగులు మాత్రం మమ్మల్ని గెలిపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో వరసగా రెండో సారి అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంకట్రామిరెడ్డిని అభినందించారు.
Also Read

సీఎం జగన్ ని కలిసిన వెంకట్రామిరెడ్డి
తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కాకర్ల వెంకట్రామిరెడ్డి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఉద్యోగులు నా వైపే ఉన్నారు. ఎన్నికలనగానే చాలా అసత్యాలు ప్రచారం చేశారు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు చూసి ఎన్నికలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలనే నేను ఎన్నికలకు వెళ్లాను. నిజాయితీగా పని చేసే వారికే ఉద్యోగులు పట్టం కట్టారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానన్నారు కాకర్ల వెంకట్రామిరెడ్డి.
Read Also:Today (22-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ.. ‘కొవిడ్’ భయాలు.. నష్టాలు..
ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్ ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి వర్గం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్సా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన వెంకట్రామి రెడ్డికి 296 ఓట్ల మెజార్టీ లభించింది. వైస్ ఛైర్మన్ గా ఎర్రన్న యాదవ్, వైస్ ఛైర్మన్ (మహిళ) – సత్య సులోచన, సెక్రటరీగా శ్రీ కృష్ణ, అడిషనల్ సెక్రటరీగా గోపీకృష్ణ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా రమాదేవి, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గా మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి, ట్రెజరర్ గా వెంకట్ ఎన్నికయ్యారు. దీంతో సెక్రటేరీయేట్లో వెంకట్రామి రెడ్డి వర్గం సంబరాలు చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు గెలుచుకుంది వెంకట్రామి రెడ్డి వర్గం. మొత్తం 9 పోస్టులకు 30 మంది అభ్యర్థులు పోటీచేశారు.
Read Also: Sreeleela: యంగ్ హీరోయిన్ కి కూడా కటౌట్ పెట్టేసారు…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!