NTV Telugu Site icon

World Kidney Day 2025: అపోలో డయాలసిస్ క్లినిక్స్ అవగాహన కార్యక్రమాలతో ముందంజ..

Apollo Dialysis

Apollo Dialysis

ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ వరంగల్‌లో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. కాగా.. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ “మీ కిడ్నీలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి, కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించండి” అనే స్ఫూర్తితో.. ఆరోగ్య శిబిరాలు, ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు కాలానుగుణమైన ఆరోగ్య సంరక్షణ, ముందస్తు జాగ్రత్తల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తోంది.

Read Also: Holi 2025: హోలీ ఆడుతున్నారా? ఈ రంగులతో జాగ్రత్త!

ఈ కార్యక్రమంలో అపోలో REACH NSR హాస్పిటల్స్ ఉచిత యూరియా, క్రియాటినిన్ పరీక్షలను అందించాయి. అదనంగా కిడ్నీ ఆరోగ్య పరిరక్షణ, ప్రమాద కారకాలు, జీవనశైలి మార్పులపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) నివారణపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం. అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ చికిత్సతో పాటు మూత్రపిండ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి.. సమాజ శ్రేయస్సును మెరుగు పర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Read Also: Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే