NTV Telugu Site icon

APMS Entrance: ‘ఇంటర్’ ప్రవేశాల కొరకు ఏపీ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ..!

3

3

ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. ఏఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ వివరాలను తెలిపింది. 10వ తరగతి ఉతీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Also Read: ACB Trap: ఏసీబీ వలలో దొరికిన సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా.. ఆమెతోపాటు..?

ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్య వివరాలు చూస్తే.. రాష్ట్రంలో ఉన్న 164 మోడల్ స్కూల్స్‌ లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌ లలో అడ్మిషన్లు ఇస్తారు. ఇందుకు గాను పదో తరగతి ఉతీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 200 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంపిక పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.

Also Read: Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్​ బాలిక పై రేప్​ అటెంప్ట్​..!

ఈ ఎంట్రన్స్ కొరకు మార్చి 28, 2024 నుండి దరఖాస్తులు ప్రారంభం అవుతుండగా.., మే 22, 2024 దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించారు. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ https://apms.apcfss.in/ ను సంప్రదించాలి.