Cyber Crime: వాట్సాప్ గ్రూప్‌లో వెడ్డింగ్ కార్డ్ పేరిట APK ఫైల్ ఫార్వార్డ్.. 100 మొబైల్ ఫోన్లు హ్యాక్..
- వాట్సాప్ గ్రూప్‌లో వెడ్డింగ్ కార్డ్ పేరిట APK ఫైల్ ఫార్వార్డ్
- 100 మొబైల్ ఫోన్లు హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్‌ను పంపారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.
Also Read:Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
Also Read
ఒక రైతు సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యురాలు పొరపాటున ఒక APK ఫైల్‌ను పెళ్లి కార్డుగా భావించి ఫార్వార్డ్ చేశారు. రైతు సంస్థ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ దానిని డౌన్‌లోడ్ చేయగా, ఆమె మొబైల్ హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత సైబర్ నేరస్థులు ఆ ఫైల్‌ను ఉప్మా చౌహాన్ పరిచయస్తుల మొబైల్ ఫోన్‌లకు ఫార్వార్డ్ చేశారు, వారు కూడా దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్‌లు కూడా హ్యాక్ అయ్యాయి.
ధాంపూర్ నివాసి సతీష్ కుమార్ కూడా ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడని, ఆ తర్వాత తన ఖాతా నుండి రూ. 2,700 డ్రా అయినట్లు చెప్పాడు. ఆ ఫైల్ ఒక పరిచయస్తుడి నంబర్ నుండి వచ్చినందున, తాను దానిని డౌన్‌లోడ్ చేసుకున్నానని, దాని ఫలితంగా తన మొబైల్ హ్యాక్ అయి, ఆటోమేటిక్‌గా మెసేజ్ లు సెండ్ అయ్యాయని తెలిపారు. కొంతమంది బాధితులు తమ మొబైల్ డేటా మొత్తాన్ని కోల్పోయారు. అయితే, రూ. 2,700 తప్ప, వారి ఖాతాల నుండి మరే ఇతర డబ్బును కాజేయలేదు. ఉప్మా చౌహాన్ సైబర్ పోలీసు హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ధాంపూర్ CO అభయ్ కుమార్ పాండే ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!