Site icon NTV Telugu

Cyber Crime: వాట్సాప్ గ్రూప్‌లో వెడ్డింగ్ కార్డ్ పేరిట APK ఫైల్ ఫార్వార్డ్.. 100 మొబైల్ ఫోన్లు హ్యాక్..

Watsaap

Watsaap

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్‌ను పంపారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్‌లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.

Also Read:Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!

ఒక రైతు సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యురాలు పొరపాటున ఒక APK ఫైల్‌ను పెళ్లి కార్డుగా భావించి ఫార్వార్డ్ చేశారు. రైతు సంస్థ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ దానిని డౌన్‌లోడ్ చేయగా, ఆమె మొబైల్ హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత సైబర్ నేరస్థులు ఆ ఫైల్‌ను ఉప్మా చౌహాన్ పరిచయస్తుల మొబైల్ ఫోన్‌లకు ఫార్వార్డ్ చేశారు, వారు కూడా దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్‌లు కూడా హ్యాక్ అయ్యాయి.

Also Read:Engineers: పగలు టెక్ జాబ్.. రాత్రిపూట క్యాబ్ డ్రైవర్ గా.. బెంగళూరు ఇంజనీర్లు ఇలా చేయడానికి కారణం ఏంటంటే?

ధాంపూర్ నివాసి సతీష్ కుమార్ కూడా ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడని, ఆ తర్వాత తన ఖాతా నుండి రూ. 2,700 డ్రా అయినట్లు చెప్పాడు. ఆ ఫైల్ ఒక పరిచయస్తుడి నంబర్ నుండి వచ్చినందున, తాను దానిని డౌన్‌లోడ్ చేసుకున్నానని, దాని ఫలితంగా తన మొబైల్ హ్యాక్ అయి, ఆటోమేటిక్‌గా మెసేజ్ లు సెండ్ అయ్యాయని తెలిపారు. కొంతమంది బాధితులు తమ మొబైల్ డేటా మొత్తాన్ని కోల్పోయారు. అయితే, రూ. 2,700 తప్ప, వారి ఖాతాల నుండి మరే ఇతర డబ్బును కాజేయలేదు. ఉప్మా చౌహాన్ సైబర్ పోలీసు హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ధాంపూర్ CO అభయ్ కుమార్ పాండే ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version